ఉరుసు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

CTR: చౌడేపల్లి మండలంలోని దాదేపల్లి హజరత్ సయ్యద్ బహుదూర్ ఆలీషా బాబా దర్గాలో శనివారం నుంచి ఉరుసు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్గాకు చేరుకున్నారు. గ్రామస్తులు, వైసీపీ నాయకులు ఆయనకు ఘణ స్వాగతం పలికారు. ఆయన చాదర్ సమర్పించి, దర్గాలో మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.