పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా దిగువకు నీటి విడుదల

SRPT: చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు మంగళవారం రాత్రి వరకు 3,97,807 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 14 గేట్లను 4 మీటర్ల మేర ఎత్తి 4,13,395 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. టీజీ జెన్‌కో 16,600 క్యూసెక్కుల నీటితో 4 యూనిట్ల ద్వారా 105 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.