ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
JN: దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలోని రైతు వేదిక వద్ద PACS ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పానుగంటి గిరి ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు పొందాలని సూచించారు.