VIDEO: 'ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి'
NTR: నందిగామ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్‌పై విస్తృత అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ తిలక్, సీఐ వైవీఎల్ నాయుడు హాజరై ద్విచక్ర వాహనదారులకు సూచనలు చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల విలువైన ప్రాణాలు కోల్పోతున్నాయని అన్నారు.