ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న సదుపాయాల గురించి ఆరా తీశారు. అలాగే అక్కడి సమస్యల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం నేపథ్యంలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు.