కేజీబీవీలో విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు
NGKL: వెల్దండ మండల కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థినులకు హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు హీమోగ్లోబిన్ పరీక్షలు చేసి, రక్తహీనత నివారణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్లు సింధు, రమణకుమార్, ప్రిన్సిపల్ స్రవంతి తదితరులు పాల్గొని విద్యార్థినులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు.