గాలివాన బీభత్సానికి కోళ్ల ఫారాల పైకప్పులు ధ్వంసం

గాలివాన బీభత్సానికి కోళ్ల ఫారాల పైకప్పులు ధ్వంసం

SDPT: తొగుట మండలంలో ఆదివారం ఉరుములు మెరుపులతో కూడిన వాన కురిసింది. మండలంలోని లింగంపేట, కాన్గల్, బండారుపల్లి, పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డిపేటలో వడగళ్లతో వరి పంటతోపాటు కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వెంకట్రావుపేట, లింగాపూర్ గ్రామాల్లోని కోళ్ల ఫారాల పైకప్పులు ద్వంసమై అందులో ఉన్న కోళ్లు కూడా మృతి చెందాయని కోళ్ల యాజమాన్యాలు అన్నారు.