హైదరాబాద్ నుంచి వెళ్లిన విమానం.. తప్పిన ప్రమాదం
హైదరాబాద్ నుంచి థాయ్‌లాండ్ వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి పుకెట్ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై దిగుతుండగా 'హార్డ్ ల్యాండింగ్' అవ్వడంతో విమానం బలంగా నేలను ఢీకొట్టింది. దీంతో విమానం చక్రం దెబ్బతిన్నప్పటికీ, పైలట్ల చాకచక్యంతో విమానం సురక్షితంగా ఆగింది. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.