అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
GNTR: తాడికొండ మండలం మోతడక గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈద్గా నిర్మాణం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మాణం, వాటర్ ప్లాంట్ ఏర్పాటు పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. పీ4 మార్గదర్శి, మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు సహకారంతో చేపట్టనున్న ఈ పనులకు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ భూమి పూజలు నిర్వహించారు.