VIDEO: 'ప్రతి ఒక్కరూ హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకోండి'
GNTR: అపోహలు పక్కన బెట్టి ప్రతి ఒక్కరూ హెచ్.ఐ.వి. పరీక్ష చేయించుకుని సురక్షితంగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా వైద్య–ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని కలెక్టర్ తెలిపారు.