నగరంలో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్

నగరంలో నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్

HYD: వేసవి ప్రభావంతో నిమ్మకాయలకు డిమాండ్ పెరిగింది. నగరంలో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. క్వింటాల్ ధర రూ.9 వేల నుంచి రూ.10 వేల వరకు పలుకుతోంది. గత నెలలో ఇది రూ.4 వేలే ఉంది. దిగుబడులు తగ్గడం, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. పలు మార్కెట్ల నుంచి బయటకు సరుకు తగ్గింది. ప్రస్తుతం రోజుకు ఒక లారీ మాత్రమే వెళ్లుతోంది.