VIDEO: కారును ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VIDEO: కారును ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

VKB: దన్నారం సమీపంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ నుంచి వస్తున్న కారును దన్నారం వైపు నుంచి అతి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా దెబ్బతింది. బైక్ నడుపుతున్న వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.