'నిర్మల్‌లో ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారానే విక్రయాలు'
NRML: జిల్లాలో ఇసుక సరఫరా పారదర్శకంగా జరగాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. వినియోగదారులు 'మన ఇసుక వాహనం' యాప్ ద్వారా రుసుము చెల్లించి బుక్ చేసుకోవాలని, అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పక్కాగా ఇసుక సరఫరా చేయాలని ఆమె అధికారులకు సూచించారు.