ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
AKP: కోటవురట్ల మండలం కొడవటిపూడి జడ్పీ హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని హెచ్ఎం ప్రతాప్ అన్నారు. సోమవారం కోడవటిపూడిలో ఉపాధి హామీ పథకం పని ప్రదేశానికి వెళ్లి ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను వేతనదారులకు ఉపాధ్యాయులు వివరించారు.