జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు
KKD: జిల్లాలో తరచూ ఎదురవుతున్న విద్యుత్ అంతరాయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.