బాధిత కుటుంబాలకు నగదు పంపిణీ

ELR: హిట్ అండ్ రన్ కేసుల్లో మృతుల కుటుంబాలకు రూ.రెండు లక్షలను, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున 14 మందికి అందించామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14 మంది కుటుంబాలకు రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ హైవే అథారిటీ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు సంయుక్తంగా నగదును ఎస్పీ ఆధ్వర్యంలో అందించారు. దీనిపై బాధిత కుటుంబాలు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.