'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి'

'ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి'

BDK: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని CPM జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కొత్తగూడెంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో సమస్యలతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారని ఆయన తెలిపారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడు మాత్రమే ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు చెప్పడానికి సానుకూలమైన వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.