రూ.1.22 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

రూ.1.22 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!

GDWL: ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు CMRF ఒక గొప్ప వరం అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గద్వాలలోని తన క్యాంపు కార్యాలయంలో గట్టు మండలానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు రూ.1.22 కోట్ల 54 వేల రూపాయల విలువైన CMRF చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.