ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NRML:​ దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి వద్ద ఆదివారం జరిగిన కారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. అతివేగం కారణంగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమణయ్య తలకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా డ్రైవర్ చిన్నారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నీలకంఠం రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై రవీందర్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.