ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్ బెతుల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటార్సీ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన క్రేన్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.