రవాణాశాఖ అధికారులతో మంత్రి జూమ్ మీటింగ్
HYD: రవాణాశాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ప్రమాదాలను అరికట్టడానికి రవాణాశాఖ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటన జరిగినప్పుడే కాకుండా నిరంతరం యాక్షన్ ప్లాన్ ఉండేలా కఠినంగా వ్యవహరించాలన్నారు.