'అన్ని రకాల వైద్య సేవలను అందించాలి'

NLG: నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాన్యం చెల్క పట్టణ వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఓపి, ఏఎన్సి, మందుల స్టాక్, టెస్టుల రిజిస్టర్లను పరిశీలించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.