గుప్త నిధుల తవ్వకాల కలకలం

MHBD: బయ్యారం మండలంలో గుప్త నిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడం కలకలం రేపుతోంది. బయ్యారంలో ఉన్న రెండు పురాతన మహదేవుని ఆలయాల వెనుక భాగంలో, అటుగా ఎవరూ రారని భావించి, స్మశానవాటిక సమీపంలో తవ్వకాలు ప్రారంభించారు. జేసీబీతో రాళ్లు తొలగించేందుకు ప్రయత్నించి విఫలమైన తరువాత అక్కడే వదిలేసి పరారయ్యారు.