సంస్కృతులు ప్రతిబింబించేలా ఉత్సవాలు: ఎంపీ

MBNR: తెలంగాణ సంస్కృతులు ప్రతిబింబించేలా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహించబోయే బతుకమ్మ ఉత్సవాల వాల్ పోస్టర్లను ఆమె హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ ఉత్సవాలలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.