వర్ధన్నపేటలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
WGL: వర్ధన్నపేట పట్టణంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం కారు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో రాజిడి వాసుదేవరెడ్డి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ కొనసాగుతోంది.