VIDEO: మఠంపల్లి మండలంలో భారీ వర్షం
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో భారీ వర్షం కురిసింది. భారీగా కురుస్తున్న వర్షానికి వరి పైరు నేలకొరిగింది. అకాల వర్షం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాగల రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.