'సుబ్బరాయుడు సాగర్ గేటు సమస్య పరిష్కారానికి చర్యలు'

'సుబ్బరాయుడు సాగర్ గేటు సమస్య పరిష్కారానికి చర్యలు'

ATP: పుట్లూరు మండలం సుబ్బరాయుడు సాగర్ గేటు సమస్యపై రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బండారు శ్రావణి భరోసా ఇచ్చారు. ​జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గేటు రిపేర్ కోసం నిపుణులను పంపాలని, కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారని తెలిపారు. అలాగే, 35 వేల ఎకరాలకు నీరందించే గండికోట లిఫ్ట్ ప్రాజెక్టుకు ఆమోదం వచ్చే అవకాశం బలపడిందని ఆమె చెప్పారు.