బుగులోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న గండ్ర
BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని శ్రీ బుగులోని వేంకటేశ్వర స్వామిని బుధవారం MLA గండ్ర సత్యనారాయణరావు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మెట్ల మార్గంలో భక్తులతో మాట్లాడి సెల్ఫీలు దిగారు. అనంతరం MLA మాట్లాడుతూ.. స్వామి అనుగ్రహంతో ప్రజలకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.