ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

SRPT : యాసంగి సీజన్‌లో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యంగా జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కేంద్రాల్లో నీడ, తాగునీరు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం వివరాలను వెంటనే ఆన్‌లైన్ చేసి, 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు.