వరద ఉధృతి పరిశీలించిన కలెక్టర్

MDK: సింగూరు ప్రాజెక్టు నుంచి 50 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. ఆదివారం పాపన్నపేట మండలం ఎల్లాపూర్ బ్రిడ్జి వద్ద వరద ఉధృతి పరిశీలించారు. లక్ష క్యూసెక్కుల నీరు విడుదల చేసిన పక్షంలో వరద ఉధృతి ఉంటుందని R&B అధికారులు కలెక్టర్‌కు వివరించారు.