తర్లుపాడులో రేపు పవర్ కట్

తర్లుపాడులో రేపు పవర్ కట్

ప్రకాశం: తర్లుపాడులో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు శనివారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఏబీ స్విచుల ఏర్పాటులో భాగంగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అన్నారు. ఈ విద్యుత్ అంతరాయానికి స్థానిక ప్రజలు సహకరించాలని వారు కోరారు.