యూజర్లకు షాకిచ్చిన జియో, ఎయిర్‌టెల్

ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. తాజాగా జియో నెలవారీ బేసిక్ ప్లాన్ రూ.249ను కూడా ఎత్తేసింది. ఈ ప్లాన్ ధరను రూ.50 పెంచి రూ.299గా చేసింది. ఈ ప్లాన్‌లో డైలీ 1.5GB డేటాను అందిస్తోంది. మరో వైపు ఎయిర్‌టెల్ రూ.249 ప్రీ పెయిడ్ ప్లాన్‌ను రూ.319కి పెంచింది. ఈ ప్యాక్‌లో డైలీ 1 GB డేటాను అందిస్తోంది.