పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
KMR: బాన్సువాడ పట్టణంలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని సోమవారం డీఎస్పీ విట్టల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది ఉన్నారు.