సంగారెడ్డిలో భారీ వర్షం

సంగారెడ్డిలో భారీ వర్షం

SRD: సంగారెడ్డి మండలంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కల్పగూర్, అంగడిపేట, తాలపల్లి గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో ఈ ఆకస్మిక వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం ధాటికి రహదారులపై నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.