రంగప్పవలసలో.. కాలువల్లో పూడికతీత పనులు

VZM: రంగప్పవలసలో కాలువలలో పూడికలు తీస్తున్నారు. కాలువల్లో పూడికలు పేరుకుపోవడంతో మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సర్పంచ్ శనపతి రాంబాబు కాలువలలో పూడికలు తొలగించే పనులను బుధవారం చేపట్టారు. కాలువలలో పూడికలు తీయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.