మెడికల్ కాలేజీలకు రెండేళ్లు పూర్తి.. వైసీపీ సంబరాలు

E.G: మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తయినట్లు జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా రాజమండ్రిలోని మెడికల్ కళాశాల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొన్నారు.