'జర్నలిస్టుల అరెస్టులు అప్రజాస్వామికం'
WGL: జర్నలిస్టుల అరెస్టులను బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. పండుగ రోజున అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి నోటీసులు ఇవ్వకుండా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. జర్నలిస్టులు నేరస్తులు కాదని, వారిపై కఠినంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. ఇటువంటి చర్యలు పత్రికా స్వేచ్ఛపై దాడి అన్నారు.