'దేశ ఆక్వా రాజధాని'గా దేనినంటారో తెలుసా..?

'దేశ ఆక్వా రాజధాని'గా దేనినంటారో తెలుసా..?

W.G: జిల్లా నేడు 'భారతదేశ ఆక్వా రాజధాని'గా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. చేపలు, రొయ్యల సాగులో జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల నుంచి ఏటా రూ.వేల కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వేలాది మందికి ఉపాధినిస్తూ, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తూ జిల్లా ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం వెన్నెముకగా నిలిచింది.