VIDEO: అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణానికి చెందిన కనుగుల లస్మవ్వ శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వృద్ధురాలు బహిర్భూమికి వెళ్లి రాగా, మనుమడు సాయి ఆమెను మంచంపై పడుకోబెట్టాడు. కొద్దిసేపటికే ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధీంతో ఎస్సై రాహుల్ గైక్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.