ఘనంగా జాతీయ గ్రంథాలయ దినోత్సవం

NTR: తిరువూరులోని గంపలగూడెం శాఖా గ్రంథాలయంలో మంగళవారం జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత దేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడు యస్. ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అకడమిక్ పబ్లిక్ లైబ్రరీల అభివృద్ధికి, గ్రంథాలయ వ్యవస్థ వికాసానికి రంగనాథన్ విశేష కృషి చేశారు. ఆయన పుట్టినరోజైన ఆగస్టు 12ను జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా ప్రకటించారన్నారు.