గుర్రంకొండలో సైబర్ అవగాహన కార్యక్రమాలు

గుర్రంకొండలో సైబర్ అవగాహన కార్యక్రమాలు

అన్నమయ్య: గుర్రంకొండ మండలంలోని పలు గ్రామాల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వాయల్పాడు సీఐ రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలు, యువకులు, విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాట్సాప్ లింకులు, అనుమానాస్పద యాప్‌ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని, జాగ్రత్తగా లేకపోతే ఆర్థిక నష్టం తప్పదని హెచ్చరించారు.