నేను తీసిన అన్ని సినిమాలు ఫ్లాపే: విజయ్
తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మూవీ నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 'నా బ్యానర్‌లో సంగుతేవన్ సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నాలుగు సినిమాలు తీశాను. వాటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురాలేదు' అని వెల్లడించాడు.