జిల్లాలో అధ్వానంగా తయారైన రోడ్డు

KNR: కరీంనగర్ మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్‌లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా తయారైంది. చిన్నపాటి వర్షానికే రోడ్డు జలమయం అవ్వడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ఇలాంటి పరిస్థితులు ప్రజలను నిరాశపరుస్తున్నాయి. మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.