'ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మునగాల తహసీల్దార్ సరిత అన్నారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడ్వాయి ఆధ్వర్యంలో, ధాన్యము కొనుగోలు కేంద్రాన్ని వెంకటరాంపురం గ్రామంలో ఈరోజు ప్రారంభించారు. కేంద్రాల్లో రైతులకు అసౌకర్యం కలగకుండా తగిన వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు.