బయటకు రావాలంటేనే భయం.. భయం..!

బయటకు రావాలంటేనే భయం.. భయం..!

NLG: నకిరేకల్ నియోజకవర్గంలో కోతులు, వీధి కుక్కల బెడద తీవ్రమైంది. చెర్వుఅన్నారంలో మహిళపై కోతి, పట్టణంలో బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కోతులు ఇళ్లపై పడి ఆహారాన్ని నాశనం చేస్తుండగా, వీధి కుక్కలు ఒంటరిగా ఉన్న పిల్లలపై తెగబడుతున్నాయి. బయటికి రావాలంటే భయంగా ఉంది అన్నారు.