మంచినీటి ఎద్దడి.. వినియోగంలోకి బావి
VZM: జరజాపుపేట 19వ వార్డు బీసీ కాలనీలో గత కొన్ని ఏళ్లుగా మంచినీటి ఎద్దడి తీవ్రంగా బాధిస్తుంది. ఈ మేరకు యువత కొంత మొత్తాన్ని వెచ్చించి, ఆ ప్రాంతంలో పాడుబడిన ఒక నూతిని, తిరిగి వినియోగానికి ఉపయోగపడేవిధంగా తీసుకురాగలిగారు. ఈ విషయం తెలుసుకున్న ఛైర్మన్ సముద్రపు రామారావు, కౌన్సిలర్లు వారి సమస్యను కమిషనర్‌కు తెలియజేయగా, పరిస్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.