VIDEO: మేడారంలో వడగళ్ల వాన.. రైతుల ఆందోళన

VIDEO: మేడారంలో వడగళ్ల వాన.. రైతుల ఆందోళన

MLG: మేడారంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గంటకు పైగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండటంతో ప్రాంతం అంతా నీటమునిగింది. ఇప్పటికే పంట చేతికొచ్చిన సమయంలో వచ్చిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మిర్చి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వడగళ్ల వాన కారణంగా పంట నాణ్యత తగ్గి, మార్కెట్ ధరలు పడిపోతాయని భయపడుతున్నారు.