అల్లూరి జిల్లాలో 25,578 ఇళ్లు అవసరం

అల్లూరి జిల్లాలో 25,578 ఇళ్లు అవసరం

ASR: పీఎం జన్ మన్ గృహ నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి పీ. అప్పలనర్స ఆరోపించారు. మంగళవారం అరకులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పీవీటీజీ తెగల కోసం ఉద్ధేశించిన పీఎం జన్ మన్ పథకం అమల్లో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. జిల్లాలో మొత్తం 25,578 ఇళ్లు అవసరం ఉందన్నారు.