ఘనంగా తిరుపతిశాస్త్రి జయంతి
W.G: జిల్లా ఉండి మండలం యండగండి శాఖ గ్రంధాలయంలో తెలుగు సాహిత్య చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్న బ్రహ్మశ్రీ దివాకర్ల తిరుపతిశాస్త్రి 154వ జయంతిని ఘనంగా నిర్వహించారు. యండగండి సహకార బ్యాంకు కార్యదర్శి చెరుకువాడ రవికుమార్ మాట్లాడుతూ.. తిరుపతిశాస్త్రి తమ గ్రామంలో జన్మించడం అదృష్టమని, ప్రతి ఏటా ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు.