అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో హౌసింగ్: సవిత
సత్యసాయి: అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలో హౌసింగ్ అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. శనివారం పెనుకొండలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఇచ్చిన హామీలన్నింటినీ క్రమంగా నెరవేర్చుతున్నామని తెలిపారు. దీపం-2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లను అందజేస్తున్నామని, అన్నా క్యాంటీన్‌ల ద్వారా నిరుపేదలకు ₹5కే భోజనం అందిస్తున్నామని తెలిపారు.